24 సీక్వెల్.. డైరెక్టర్ ఏమన్నారంటే?


టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన విక్రమ్ కే కుమార్, సూర్యతో చేసిన 24 సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా టెక్నికల్గా ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య అందులో కేవలం హీరో గానే కాకుండా ప్రతి నాయకుడి పాత్రలో కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు.

టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ తరహాలో తెరకెక్కిన ఆ సినిమా సీక్వెల్ వస్తే బాగుంటుంది అని ఓవర్గం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలైతే మొదట ఈ సినిమాను మహేష్ బాబుతో చేయాలని అనుకున్నారు కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో సూర్యతో చేయడం జరిగింది. ఇక రీసెంట్గా థాంక్యూ సినిమా ప్రమోషన్స్లో దర్శకుడు విగ్రహం కే కుమార్ తప్పకుండా ఫ్యూచర్ లో 24 సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని అన్నారు.

అందులో విలన్ పాత్ర అయినటువంటి ఆత్రేయ క్యారెక్టర్ నుంచి మరొక కొత్త కథ కొనసాగుతుంది అని.. అయితే అందుకు సంబంధించిన కథ రెడీ చేయడానికి మాత్రమే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నారు. సమయం కూడా ఎక్కువ పడుతుంది అని విక్రమ్ చెప్పారు. ఇక ప్రస్తుతం నాగచైతన్యతోనే ఈ దర్శకుడు దూత అనే ఒక హారర్ వెబ్ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post