యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమా పై డిమాండ్ చాలా పెరుగుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ కూడా గట్టిగానే ఉంటాయని చెప్పవచ్చు. జూలై 22న రానున్న ఈ సినిమాకి థియేట్రికల్ గా అలాగే నాన్ థియేట్రికల్ గా కూడా మంచి డీల్స్ సెట్ అయినట్లు సమాచారం.
కార్తికేయ 2 సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా తరహాలోనే హిందీ తమిళ్ మళయాళ కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక సినిమా అన్ని భాషల్లో 18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్. దాదాపు అన్ని ఏరియాలకు అమ్ముకున్న నిర్మాతలు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక నాన్ థియేట్రికల్ గా 16 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ అందించినట్లు సమాచారం. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బయ్యర్లకు ఎలాంటి ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment