స్టార్ హీరో అవ్వాలి అంటే అదృష్టంతో పాటు టాలెంట్ కూడా గట్టిగానే ఉండాలి. స్టార్ హోదా వచ్చిన తరువాత దాన్ని కాపాడుకోవడం కూడా మరో పెద్ద టాస్క్.
ఇక విజయ్ ఆ విషయంలో కష్టపడి పైకొచ్చాడు అనే చెప్పాలి. అతను హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు మొహం పట్టుకొని వీడు హీరో ఏంటి అన్నారు. ఫేస్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఉండదని హేళన చేశారు.
విజయ్ చిన్న తనంలో తల్లి పాటలు పాడుతూ 100 రూపాయలు సంపదిస్తేనే వారికి ఒక మూడు రోజులు భోజనం ఉండేదట. ఇక ఆ మధ్యతరగతి కష్టం నుంచి తండ్రి దర్శకుడిగా మారడంతో విజయ్ సినీ రంగంలో అడుగు పెట్టాడు. అతని మొదటి సినిమా వెట్రిలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మారినప్పుడు ఆ చిత్ర నిర్మాత 500 రూపాయలు చేతిలో పెట్టి ఫ్యూచర్ లో స్టార్ హీరో అవుతావని అన్నట్లు విజయ్ తండ్రి ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. విజయ్ అనుకున్నట్లే ఇప్పుడు 90కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే స్టార్ హీరోగా ఎదిగాడు.
Follow @TBO_Updates
Post a Comment