కథ:
ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ను కొనసాగించాలి అనే ఆలోచనతో కొనసాగే యువకుడు కృష్ణ(కిరణ్ అబ్బవరం). అయితే ఒక మ్యారేజ్ ద్వారా అతను శాన్వి అనే అమ్మాయిని కలుస్తాడు. ఇక ఆమె గతం గురించి అతనికి కొంత తప్పుడు అభిప్రాయం ఉన్నప్పటికీ అతను ఆమెను లైక్ చేసేందుకు ఇష్టపడతాడు. ఇక ఆ తరువాత వారిద్దరూ ఎలాంటి ఆలోచనతో ఒకటయ్యారు? ఇద్దరి అభిప్రాయ బేధాలు భిన్నంగా ఉన్న సమయంలో ఇద్దరు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు? అనేది సినిమా అసలు కథ.
విశ్లేషణ:
టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపును అందుకున్న కిరణ్ అబ్బవరం నుంచి మొదటి నుంచి కూడా భిన్నమైన కథలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సారి కూడా అతను నేటి తరం యువతరం లో ఉండే కొన్ని లోపాలను ఆధారంగా చేసుకునే ఒక అందమైన ప్రేమను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమా మొదట్లో కాస్త సరదాగా సింపుల్ సన్నివేశాలతో కొనసాగుతూ ఆ తర్వాత లవ్ బ్యాక్ గ్రౌండ్ ఎమోషనల్ సన్నివేశాలతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కిరణ్ అబ్బవరం నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అంటే చెప్పాలి. ఒక మధ్యతరగతి యువకుడు ఎలాగైతే ఆలోచిస్తాడో అదే తరహాలో అతను చూపించిన హావభావాలు చాలా చక్కగా ఉన్నాయి.
అతనికి తగ్గట్టుగా చాందిని చౌదరి శాన్వి అనే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది అనే చెప్పాలి. ఇద్దరు కూడా వారి పాత్రలకు సరైన న్యాయం చేసి సినిమాకు ఒక సరికొత్త రూపాన్ని తీసుకువచ్చారు. కథ విషయంలో అయితే పెద్దగా చెప్పుకోవాల్సిన ఆశ్చర్యకరమైన అంశాలు ఏమీ లేవు. కానీ దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఎవరు చూపించని కొన్ని యూత్ ఫుల్ మూమెంట్స్ ను ఈ సినిమాలో హైలెట్ చేశాడు. ప్రేయసిపై ఉండే స్వార్థపూరితమైన ప్రేమ అలాగే ఒక అమ్మాయి పై ఉండే తప్పుడు అభిప్రాయాలను చుట్టూ కొన్ని అంశాలను చాలా చక్కగా చూపించారు.
ఇక అలాంటి ఆలోచనలతో ఇద్దరు ప్రేమికులపై కలిగే సంక్లిష్టత అలాగే వారు ఎదుర్కొనే మనోవేదనను చాలా ఎమోషనల్ గా కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలలో కిరణ్ అద్భుతంగా నటించాడు. ఇక తెలుగు అమ్మాయి చాందిని షాన్వి గ మరోసారి తన టాలెంట్ ఏమిటో నిరూపించుకుంది. కెమెరా పనితనం కూడా ఈ సినిమాకు చాలా బాగానే సెట్ అయింది. శేఖర్ చంద్ర ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సన్నివేశాలకు బలాన్ని ఇచ్చాయి అని చెప్పాలి. కానీ సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేదు.
అయితే దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఇంకా కొన్ని సన్నివేశాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఇంతకు ముందు కిరణ్ నటించిన సినిమాల్లోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఈ సినిమాలో సాంగ్స్ అయితే అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. ఇక డైరెక్టర్ ఈ సినిమాను రొమ్-కామ్ ఎంటర్‌టైనర్ గా తెరపైకి తీసుకు రావాలనే ఆలోచన బాగానే ఉన్నా సరైన స్టోరీ నెరేషన్ లేకపోవడం వల్ల అక్కడక్కడా కాస్త బోర్ కొట్టేస్తుంది. కానీ కీలకమైన సన్నివేశాలను మాత్రం బెస్ట్ స్క్రీన్ ప్లే తో బాగానే హైలెట్ చేశాడు. మొత్తానికి సినిమా అయితే పర్వాలేదు అనిపించే విధంగా, ముఖ్యంగా యూత్ ఆకట్టుకునే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్:
👉హీరో హీరోయిన్ నటన
👉బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
👉ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
👉అక్కడక్కడా కాస్త బోర్ కొట్టే సీన్స్
👉సాంగ్స్
రేటింగ్: 3/5
Follow @TBO_Updates
Post a Comment