సోలోగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి సమ్మతమే అనే మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను గోపీనాథ్ రెడీ డైరెక్ట్ చేశారు. క్యూట్ రొమాంటిక్ ఫిల్మ్ గా రానున్న ఈ సినిమాపై విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.
రీసెంట్ గా సెన్సార్ వర్క్ ఫినిష్ చేసుకున్న సమ్మతమే సినిమాకు U/A సర్టిఫికెట్ లబించింది. ఇక సినిమాను గ్రాండ్ గా ఈ నెల 24న విడుదల చేయబోతున్నారు. అయితే సెన్సార్ యూనిట్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ కామెంట్స్ అందినట్లు తెలుస్తోంది. సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా లవ్లీగా కొనసాగుతుందట. మంచి ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఫస్ట్ హాఫ్ కామెడీతో ఆ తరువాత కొన్ని హార్ట్ టచింగ్ లవ్ సీన్స్ తో సమ్మతమే ఆకట్టుకోనుందట.
అలాగే సినిమాలో ఉండే ఒక క్యూట్ రివెంజ్ లవ్ ఎపిసోడ్స్ కూడా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై చిత్ర యూనిట్ సభ్యులు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. ఇక సెన్సార్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందని అనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన సినిమాలు కూడా అంతగా క్లిక్ అవ్వలేదు కాబట్టి సమ్మతమే ఏ మాత్రం క్లిక్కయినా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం కాయం. మరి మొత్తంగా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నెంబర్లను అందుకుంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Follow @TBO_Updates
Post a Comment