RRR 'గే' కెమిస్ట్రీ.. ఇదేమి పోలికరా బాబు?


ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల ఆధారంగా RRR సినిమాను కల్పిత కథతో తెరపైకి తీసుకు వచ్చినట్లు రాజమౌళి చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ పూర్తి పేర్లు అయితే వాడలేదు. ఇక ఆ సంగతి అటుంచితే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన అనంతరం నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీయులు కూడా చూస్తున్నారు.

అయితే కొంతమంది వేస్ట్రన్ నెటిజన్లు మాత్రం గే రిలేషన్షిప్ తో సినిమా కొనసాగింది అంటూ ఊహించని విధంగా కామెంట్స్ చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో అలా కామెంట్ చేసిన వారు స్వలింగసంపర్కులు కాబట్టి అలా స్పందిస్తున్నట్లుగా RRR ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక రకంగా ఈ దిక్కుమాలిన పోలికతో ఓ వర్గం ఫ్యాన్స్ అయితే మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగతా హాలీవుడ్ సినిమాలలోని క్యారెక్టర్స్ ను చూపిస్తూ మరి ఇదేమిటి అని కౌంటర్స్ ఇస్తున్నారు. స్నేహాన్ని యాక్షన్ అడ్వెంచరస్ గా హైలెట్ చేసిన సినిమాకు ఇలాంటి దిక్కుమాలిన పోలికలతో ఎలా పొలిస్తున్నారో అని కూడా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.

Post a Comment

Previous Post Next Post