కథ:
2008 ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మూవీ మేజర్. సందీప్ బాల్యం నుంచి అతను ఆర్మీలో ఎలా చేరాడు ముంబై టెర్రర్ ఎటాక్ కంటే ముందు అతను ఎదుర్కొన్న కొన్ని సవాళ్లు ఏంటి? ఆర్మీలో చేరడానికి ప్రేరణ, అతని తల్లిదండ్రుల అడ్డంకులు, ప్రేమ జీవితం ఇలా అతని ఎదుగుదల వంటి అంశాలతో సినిమా కొనసాగుతుంది. ఇక NSG కమాండోగా అతను ఉగ్రవాద దాడులలో ఎలా వీరమరణం పొందాడు అనే అంశాలతో కొనసాగే ఈ కథ గురించి అందరికి తెలిసిందే. ఇక సందీప్ మొత్తం జీవితం ఏమిటనేది ఈ సినిమాలో చూసి తెలులుకోవాలి.
విశ్లేషణ:
ఇంతకుముందు భారత సైనికుల పై ఎన్నో విభిన్నమైన సినిమాలు తెరకెక్కించారు. ఇక కమర్షియల్గా వాటికి ఎంతో కొంత మెరుగులు దిద్దడం ఆనవాయితీగా వస్తున్నదే. అయితే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం విషయంలో మాత్రం అలాంటి వాటికి పెద్దగా అవకాశం లేదని సందీప్ లైఫ్ లోనే ఎన్నో రియల్టీక్ ఎంటర్టైన్మెంట్ అంశాలు ఉన్నాయని ముందుగానే హీరో అడవి శేష్ క్లారిటీ ఇచ్చాడు. ఇక మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సినిమా విషయానికి వస్తే మొదటి అరగంట పాటు అతని బాల్యం అలాగే అతని ఫస్ట్ లో తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత ఇలా ఎన్నో అంశాలను పైలెట్ చేశారు.
అయితే మొదట్లో కొంత బోరింగ్ అనిపించినప్పటికీ కూడా అందులో ప్రతి సన్నివేశం కూడా సెకండాఫ్ లో వచ్చే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా దర్శకుడు శశికిరణ్.. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం విషయంలో లిబర్టీ తీసుకోకుండా చాలా సున్నితంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. మేజర్ మూవీ గతంలో మనం చూసిన 26/11 సినిమాల కంటే భిన్నమైన చిత్రం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పోరాడి ఎలా చనిపోయాడు అనేదే కాకుండా ఎలా జీవించాడు అనేదే సినిమాలో మరో ప్రధాన అంశం.
అయితే కొన్ని లవ్ సీన్స్ అలాగే ఫ్యామిలీ కి సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ప్రజెంట్ చేస్తే బాగుండేది. వాటిని రియాల్టీ గా ప్రజెంట్ చేయాలని అనుకున్నాడో ఏమో కానీ ఓ వర్గం ప్రేక్షకులకు అంత కనెక్ట్ కాకపోవచ్చు అనిపిస్తుంది. ఇక ఫస్టాఫ్ లో కొంత బోరింగ్ అనిపించినప్పటికీ కూడా సెకండాఫ్ లో మాత్రం దర్శకుడు అసలైన ఆయుధాలను ఉపయోగించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించింది.
సెకండాఫ్ తాజ్‌లో ఆపరేషన్ తో స్టార్ట్ అవుతుంది. ఫస్టాఫ్లో కొన్ని సన్నివేశాలకు మళ్ళీ ఆ ఎపిసోడ్ కు కనెక్ట్ చేసిన విధానం కూడా ఎంతో బాగుంది. ఇక మరొక వైపు తన భార్య కోసం కూడా అతను గుర్తు చేసుకునే విధానం కూడా చాలా ఎమోషనల్ ఫీలింగ్ కలిగిస్తుంది. అబ్బూరి రవి అందించిన డైలాగ్స్ కూడా ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో శ్రీ చరణ్ పనితనం అద్భుతం.
ఇక సందీప్ ఉన్నికృష్ణన్ చివరగా చనిపోయే సన్నివేశంలో కూడా అడివి శేష్ అందరిని కంటతడి పెట్టించాడు అనే చెప్పాలి. ఆ తర్వాత అతని అంతిమ యాత్ర, కొడుకు వీర మరణం గురించి చెబుతూ ప్రకాష్ రాజ్ ఎంతో భావోద్వేగాన్ని కలిగించారు. ఒక సైనికుడిగా ఉండడం ఎంత ఆనందంగా ఉంది? ఎందుకు సోల్జర్ అవ్వాలి అనేది ప్రధానమైన అంశాన్ని కూడా సినిమాల్లో హైలెట్ చేయడం కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మేజర్ సినిమా అయితే ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం అని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎమోషనల్ డాక్యుమెంట్ చేయబడిన సినిమాగా మేజర్ హైలెట్ కాబోతోంది.
ప్లస్ పాయింట్స్
👉అడివి శేష్ నటన
👉యాక్షన్ సీన్స్
👉క్లయిమ్యాక్స్
👉బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
👉డైలాగ్స్
మైనస్ పాయింట్స్
👉ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు
రేటింగ్: 3.50/5
Follow @TBO_Updates
Post a Comment