మహానటి సినిమాతో జీవితానికి సరిపోయేంత గుర్తింపు అందుకున్న కీర్తి సురేష్ ఆ తరువాత ఆ ఫీవర్ నుంచి బయటకు రావడానికి బాగానే ప్రయత్నాలు చేసింది. సావిత్రమ్మ పాత్ర చేసిన అనంతరం జనాలు కమర్షియల్ హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయడం కష్టమని అనుకుంటున్న తరుణంలో మెల్లగా తెలియకుండానే ఆ మాయ నుంచి బయటకు వస్తోంది.
ఇక రీసెంట్ గా కీర్తి సురేష్ మైమరిపించే బ్యూటీఫుల్ లుక్ తో షాక్ ఇచ్చింది. తెల్లని ఇంగ్లీష్ డ్రెస్ లో ఎద అందాలను హైలెట్ చేస్తూ నిర్వహించిన ఫొటో షూట్ మామూలుగా లేదు. చూస్తుంటే గ్లామరస్ పాత్రలు చేసేందుకు మరో గీత దాటేందుకు సిద్ధమైనట్లు కూడా అనిపిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు కూడా అమ్మడు మరో అడుగు ముందుకు వేసినట్లు అనిపిస్తోంది. మరి ఇలాంటి ఫొటో ఘాట్స్ తో కీర్తి ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment