గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ 108వ సినిమాపై అంచనాలు చాలా ఉన్నాయి. క్రాక్ అనంతరం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతుండడం అలాగే అఖండ అనంతరం బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో క్రేజ్ మామూలుగా లేదని ఇటీవల ఫస్ట్ లుక్ టీజర్ తో క్లారిటీ వచ్చేసింది.
ఇక ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ చర్చల్లో ఉంది. సినిమా కాన్సెప్ట్ పై ఒక టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో రెండు భీకరమైన ఫ్యాక్షన్ ఫైట్లు అనంతరం విదేశాల్లో కూడా బాలయ్య స్టైల్ లో అదే నరుకుడు ఉంటుందట. ఇక షాక్ ఇచ్చేలా ఒక ఇంటర్వెల్ బ్యాగ్ అనంతరం నందమూరి బాలకృష్ణ మరో పాత్రలో కనిపిస్తాడట. అంటే రొటీన్ సక్సెస్ ఫార్ములా డ్యూయల్ రోల్ అని తెలుస్తోంది. మరి ఈ ఫార్మాట్ లో బాలయ్య బాబు ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment