దొంగచాటుగా సినిమా థియేటర్ లో బన్నీ!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకు సంబంధించిన వారి సినిమాలు మాత్రమే కాకుండా ఇతర హీరోల సినిమాలు కూడా రెగ్యులర్ చూస్తూనే ఉంటాడు. ఆలస్యమైనా కూడా కొన్ని సినిమాలను అయితే ఏమాత్రం మిస్ అవ్వకుండా ఎవరెవరు ఏం చేస్తున్నారు అని బాగా పరిశీలిస్తూ ఉంటాడు. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ దొంగచాటుగా ఒక సినిమా థియేటర్ కు వెళ్లి మరి సినిమా చూసినట్లు అల్లు అరవింద్ ద్వారా తెలిసింది.

అల్లు అర్జున్ ఇటీవల హాలిడేస్ ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఎలాంటి సినిమా విడుదలైన కూడా బన్నీ తన ఇంట్లోనే క్యూబ్ ద్వారా ప్రత్యేకంగా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా సినిమా చూస్తూ ఉంటాడు. అయితే F3 సినిమా మాత్రం అదే తరహాలో చూస్తే అంతగా కిక్ రాదు అని థియేటర్లో జనాల మధ్యన ఆ వాతావరణంలో చూస్తేనే బాగుంటుంది అని చెప్పడంతో అల్లు అర్జున్ కూకట్ పల్లిలోని ఒక మాస్ థియేటర్కు వెళ్లి సినిమా చూసినట్లుగా ఆయన తెలియజేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మాస్క్ వేసుకొని ఇంటర్వెల్ టైం లో మళ్ళీ బయటకు వచ్చిన బన్నీ ఆ తర్వాత సినిమా మొత్తం ఆడియెన్స్ కలిసి చూశాడట.


Post a Comment

Previous Post Next Post