F3 బడ్జెట్.. తేడా వస్తే ఫసక్?


కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న F3 సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి టికెట్ల రేట్లు కూడా పెంచలేదు. మొదట F2 సాధించిన కలెక్షన్స్ పై నమ్మకంతో దిల్ రాజు ఈ సినిమా కోసం బడ్జెట్ కాస్త ఎక్కువగానే పెట్టాడు. అంతే కాకుండా స్టార్స్ కు అడిగినంత రెమ్యునరేషన్స్ ఇచ్చేశారు.

హీరోలకు F2 కంటే త్రిబుల్ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బడ్జెట్ అయితే 45కోట్లు దాటినట్లు సమాచారం. F2 అయితే ఎలా ఆడింది అనేది మిస్టరీ అంటుంటారు. ఇక ఇప్పుడు రొటీన్ రొట్ట కామెడీ, కమర్షియల్ సినిమాలను దూరం పెడుతున్న ఆడియెన్స్ కు F3 ఎలా ఆకట్టుకుంటుంది అనేది మరో మిస్టరీ. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ ట్రైలర్స్ ఏమి పెద్దగా బజ్ క్రియేట్ చేసింది లేదు. ఇక రిస్క్ ఎందుకని టికెట్ల రేట్లు కూడా పెంచలేదు. మరి దిల్ రాజు పెట్టిన బడ్జెట్ ఎలా రికవరీ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post