F3 Movie @ Review and Rating


కథ:
వెంకీ (వెంకటేష్), వరుణ్ (వరుణ్ తేజ్) సాధారణ మిడిల్ క్లాస్ లైఫ్ తో జీవిస్తూ సంపన్నులుగా మారాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఈ క్రమంలో ఒకరోజు విజయనగరంలో ఒక సంపన్న పారిశ్రామికవేత్త(మురళి శర్మ) తన వారసుడి కోసం వెతుకుతున్నాడని తెలుసుకుంటారు. వెంటనే వెంకీ, వరుణ్ అతని గ్యాంగ్  వారసుడిగా నటిస్తూ అతని ఇంటి వెళతారు. ఈ క్రమంలో వెంకటేష్, వరుణ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి పొరపాట్లు చేశారు? అసలు నిజం తెలిసిన తరువాత ఏం జరుగుతుందనేది వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ
దర్శకుడు అనిల్ రావిపూడి F2 సినిమాలో ఎలాగైతే లాజిక్స్ తో సంబంధం లేకుండా కామెడీని క్రియేట్ చేశాడో ఇప్పుడు కూడా అదే తరహాలో F3 లో ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు.  డబ్బు అనే కాన్సెప్ట్ లోని సమస్యలను తనదైన కామెడీ స్టైల్ లో చూపించే ప్రయత్నం చేశాడు. వెంకటేష్ రే చీకటి అలాగే అతని ఫ్యామిలీ లైఫ్ ఇక వరుణ్ తేజ్ నత్తి సీన్స్ కూడా సినిమాలో హైలెట్ గా నిలిచాయి. F3లో ప్రధాన తారాగణాన్ని ఉపయోగించి, అనిల్ రావిపూడి కామెడీని జనరేట్ చేశాడు. నిర్దిష్ట కథనం లేకుండా సాపేక్షంగా ఆకర్షణీయమైన కాన్వాస్‌ను సృష్టించారు. పాత్రలకి తగ్గట్టుగా కొన్ని ఎపిసోడ్‌లు బాగున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో పాత టైమర్ పాటలను ఉపయోగించడం కూడా బాగానే వర్కౌట్ అయ్యింది.

ఫస్ట్ హాఫ్ మొత్తంలో పాత్రలను హైలెట్ చేస్తూ వెళ్లిన అనిల్ ఆ తరువాత స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక సినిమా మొత్తం స్క్రీన్‌టైమ్‌తో వెంకటేష్ ముందున్నాడు.  అతని కామెడీ టైమింగ్ అతని రే చీకటి సంబంధించిన సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. 
కొన్ని సాంగ్స్ ను అనిల్ రావిపూడి క్రియేటివ్‌గా రూపొందించిన విధానం కూడా హైలెట్ గా ఉంది. ఇక  వరుణ్ తేజ్ తెలంగాణ యాస డైలాగ్స్‌తో మంచి నటనను కనబరిచాడు. అతని నత్తి కవరింగ్ మ్యానరిజం టాప్ నాచ్‌ అని చెప్పవచ్చు.  చాలా కాలం తర్వాత, సునీల్ ఫన్ సైడ్‌ కిక్‌గా తన శక్తికి తగ్గట్టుగా నటించాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ సంపత్ రాజ్ అవినీతి పోలీసుల పాత్రలతో మంచి ఫన్ క్రియేట్ చేశాడు. అలీ ఎపిసోడ్‌లు కూడా నవ్వులు పూయించాయి.

సినిమా ద్వితీయార్ధంలో ఆనంద్ ప్రసాద్ (మురళీ శర్మ) డబ్బు కోసం మరొక స్కామ్‌ తో కథ కొత్త మలుపు తిరుగుతుంది. సెకండ్ మిడ్ లో కామెడీ బాగానే వర్కౌట్ అయినప్పటికీ చివరికి వచ్చే సరికి క్లైమాక్స్ లో మాత్రం దర్శకుడు చాలా బలవంతంగా కామెడీని క్రియేట్ చేసినట్లు అనిపించింది. ఇక టాలీవుడ్ స్టార్స్ తో ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసిన విధానం హైలెట్ గా ఉంది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ ఇలా అందరితో అనిల్ పేరడీ చేసిన విధానం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక దేవిశ్రీప్రసాద్ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ లో ఏ మాత్రం పస లేదు. పూజా హెగ్డే తో ఐటెమ్ సాంగ్ ఉన్నా పెద్దగా ఉపయోగం లేనిది. ఇక మొత్తంగా లాజిక్స్ గురించి ఆలోచించకుండా సినిమాకు వెళితే సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. అక్కడక్కడా చిరాకు తెప్పించే సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా అనిల్ మ్యాజిక్ ఓ వర్గం ఆడియెన్స్ కు కనెక్ట్ కావచ్చు. 

ప్లస్ పాయింట్స్: 
👉వెంకటేష్, వరుణ్ తేజ్ క్యారెక్టర్స్
👉 కామెడీ ఎపిసోడ్స్

మైనెస్ పాయింట్స్:
👉మ్యూజిక్
👉క్లయిమ్యాక్స్

రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post