మహేష్ బాబు నుంచి వస్తున్న సర్కారు వారి పాట సినిమాపై నిన్నటివరకు కొన్ని అనుమానాలు గట్టిగానే వచ్చాయి. ఇక ఆచార్య డిజాస్టర్ కావడంతో కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లింది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. పైగా మైత్రి మూవీ మేకర్స్ హైప్ క్రియేట్ చేయడంలో చాలా నెమ్మదిగా ఉందని కూడా ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు.
ఇక మొత్తానికి ట్రైలర్ సినిమాపై అంచనాలను మార్చేసింది. ఇది కదా కావాల్సింది అని ఫ్యాన్స్ పరశురామ్ కు దండలు వేసేందుకు సిద్ధమయ్యారు. మహేష్ యాక్షన్ కామెడీ టైమింగ్ క్యూట్ రొమాన్స్ ఇలా అన్ని అంశాలు బలంగానే ఉన్నాయి. ఇక ఆచార్య సినిమా తేడా కొట్టడంతో సమ్మర్ హాలిడేస్ లో ఈ సినిమా తప్పకుండా క్లిక్ అవుతుందని అనిపిస్తోంది.
కానీ ఆచార్య తరహాలో దూరాశకు పోకుండా టికెట్ల రేట్ల విషయంలో సర్కారు వారి పాట కాస్త ఆలోచిస్తే బావుంటుంది. నలుగురు ఉండే ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళితే ఈజీగా 2 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఫ్యామిలిస్ పిల్లలతో కలిసి ఈ సినిమాను చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్కారు వారి పాట టీమ్ కాస్త తగ్గితే బెటర్ అని చెప్పవచ్చు.
Follow @TBO_Updates
Post a Comment