ఆచార్య.. ఎన్ని కోట్లు ముంచినట్లు?


ఆచార్య సినిమా మొదటిరోజే నెగిటివ్ టాక్ అందుజున్నప్పటికి మెగా హీరోల వలన 30కోట్ల షేర్ అయితే వచ్చింది. ఇక రెండవ రోజు నెగిటివ్ టాక్ ప్రభావం గట్టిగానే పని చేసింది. దీంతో సినిమాకు శనివారం తెలుగు రాష్ట్రాల్లో 5కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇక ఆదివారం 5 కోట్లకు మించి వసూళ్లు దాటకపోవచ్చు.

ఫైనల్ గా సోమవారం నాటికి ఆచార్య బాక్సాఫీస్ వద్ద సందడి ముగిసే అవకాశం ఉంది. ఇక మొత్తంగా ఆచార్య తెలుగు ఇండస్ట్రీలోనే దాదాపు 80కోట్ల వరకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాక్సాఫీస్ వద్ద సుమారు 135కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే కేవలం 40కోట్ల షేర్ రాబట్టింది. ఇక వీకెండ్ అనంతరం కలెక్షన్స్ ఇంకా ఎంత డ్రాప్ అవుతాయో తెలియదు.

Post a Comment

Previous Post Next Post