నాని - ప్రశాంత్ నీల్.. వామ్మో ఇదేమి లెక్క?


దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాల సక్సెస్ అనంతరం పూర్తిగా టాలీవుడ్ హీరోల పైన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ తో సలార్ సినిమా షూటింగ్ ను సగం వరకు పూర్తి చేశాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 31 వ సినిమాకు డైరెక్షన్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 3  ఉంటుందని మొన్నటి వరకు ఒక టాక్ వచ్చింది.

అయితే ప్రశాంత్ నీల్ ఆలోచనలో మరొక తెలుగు హీరో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అతనే నేచురల్ స్టార్ నాని. నాని కూడా మెల్లగా తన మార్కెట్ ను పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసుకుంటూ వస్తున్న ప్రశాంత్ నాని కూడా ఒక కమిట్మెంట్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి గతంలో మాదిరిగా నాని ఈ వార్తలపై క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post