మహేష్ బాబు కోసం ఓల్డ్ టైటిల్?


త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 28వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మరి కొన్ని వారాల్లో మొదలు కాబోతున్న ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో కూడా ఇటీవల ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు అర్జునుడు అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇదివరకే గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు అర్జున్ అనే సినిమా చేశాడు  ఇక మళ్ళీ ఇన్నాళ్ళకు త్రివిక్రమ్ కూడా మళ్లీ అదే తరహా టైటిల్ పై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కథకు తగ్గట్టుగా అర్జునుడు అనే టైటిల్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారట. కుదిరితే ఈ నెల 31వ తేదీన కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post