నిహారిక లిప్ లాక్ ఫొటో వైరల్!


మెగా డాటర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల పేరు ఇటీవల కాలంలో కాంట్రవర్సీ వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. సోషల్ మీడియా ప్రభావం వలన ఆమె మధ్యలో చిరాకుపడి కాస్త దూరంగా జరిగింది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు కూడా దూరం అయిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఆ తర్వాత చాలా నేర్చుకున్నాను అంటూ ఆమె రీ ఎంట్రీ కూడా ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు వీడియోల పై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

రీసెంట్ గా తన భర్తతో కలిసి హాలిడే ట్రిప్కు వెళ్లిన నిహారిక మొదటి సారి లిప్ లాక్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలే పలు వివాదాలతో ట్రోలింగ్ కు గురైన నిహారిక ఇప్పుడు ఇలాంటి ఫోటో పోస్ట్ చేయడంతో మరింత వైరల్గా మారింది. ఇక ఆ ఫోటో పోస్ట్ చేస్తూ నిహారిక ఫరెవర్ బాండింగ్ అంటూ వారిపై వస్తున్న రూమర్స్ కు కూడా చెక్ పెట్టేసింది. అంతేకాకుండా ఆమె ఎమోషనల్ ఏమోజీని కూడా అందులో జత చేయడం విశేషం.


Post a Comment

Previous Post Next Post