యంగ్ హీరోతో.. సమంత లిప్ లాక్?


సౌత్ ఇండియన్ గ్లామరస్ బ్యూటీ సమంత మరోసారి లిప్ లాక్ సన్నివేశంలో నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకే ఆమె కొన్ని సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి తర్వాత కూడా రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ తో కూడా ఆమె లిప్ లాక్ సన్నివేశంలో నటించింది.

ఇక ఇప్పుడు మరొక రొమాంటిక్ హీరో తో కూడా సమంత అలాంటి సన్నివేశంలో నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలవబోతున్నాయి. అయితే అందులో విజయ్ దేవరకొండ సమంత లిప్ లాక్ సన్నివేశం తో ఆశ్చర్యపరిచబోతున్నట్లు సమాచారం. ఇదివరకే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియక్ర్ కామ్రేడ్ సినిమా లో ఘాటైన ముద్దు సన్నివేశాల్లో నటించి ఆశ్చర్యపరిచాడు. మరి ఇప్పుడు ఖుషి సినిమాలో ఎలా నటిస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post