సినీ పరిశ్రమలో నటుడికి స్టార్ డమ్ రావాలంటే ఒక్క విజయం చాలు. కానీ ఒక్కసారి ఆ స్టార్‌డమ్‌ని పొందితే, వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు. రెమ్యునరేషన్ దగ్గర్నుంచి ఆఫర్ల వరకు అన్నీ పెరిగిపోతాయి. ఒక నటుడు ఇటీవల 40 లక్షల పారితోషికం నుంచి ఒక్క ఏడాదిలోనే ఒక్కసారిగా 20 కోట్ల రెమ్యునరేషన్ కు చేరుకోవడం దేశంలో హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లావత్ గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ప్రముఖ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇక 2020లో అతను నటించిన పాతాల్ లోక్ వెబ్ సీరీస్ మంచి విజయాన్ని అందుకుంది. లీడ్ రోల్ లో జైదీప్ సంచలన ప్రదర్శన ఇచ్చాడు. దానికి అతను ప్రజాదరణ, విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇక ఆ వెబ్ సీరీస్ కు అతనికి 40 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇక ఇప్పుడు అదే వెబ్ సీరీస్ సీజన్ 2 కోసం ఏకంగా 20కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ కంటే 50 రేట్లు ఎక్కువ పారితోషికం అందుకుంటున్న అతను త్వరలోనే పాతాల్ లోక్ సీజన్ 2తో రాబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ లోనే ఆ సీరీస్ విడుదల కానుంది.
Follow @TBO_Updates
Post a Comment