స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ పుష్ప పార్ట్ వన్ తో ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది.
బాహుబలి తరహాలోనే ఈ సినిమాలో కూడా ఒక బలమైన ట్విస్ట్ ఉంటుందట. అది కూడా కట్టప్ప తరహాలోనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాహుబలి సినిమాలో నమ్మిన వ్యక్తి కట్టప్ప ఎలాగైతే బాహుబలి ని వెన్నుపోటు పొడుస్తాడో అదే తరహాలో పుష్ప రాజ్ వెనకాలే ఉండే కేశవ కూడా అల్లుఅర్జున్ ను వెన్నుపోటు పొడుస్తాడు అని తెలుస్తోంది. కానీ అందులో మరి బాహుబలి తరహాలో ఉండకుండా సుకుమార్ కాస్త భిన్నంగా తనదైన స్టైల్లో లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ట్విస్ట్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment