ఆ హీరోను అలా ఒప్పించిన ప్రభాస్!


సలార్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రభాస్ రాధే శ్యామ్ మలయాళం ప్రమోషన్ లో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే విషయమై పృథ్వీరాజ్ స్పందించాడు. గత సంవత్సరం సలార్‌లో కీలక పాత్ర కోసం ప్రశాంత్ నీల్ నా వద్దకు వచ్చాడు అని.. కానీ షూట్ వాయిదా పడడంతో తాను మరొక ప్రాజెక్ట్‌కు సంతకం చేసినట్లు చెప్పాడు.

ఇక ఆ సమయంలో తాను సలార్ కోసం సమయం కేటాయించలేకపోతున్నాను అన్నప్పుడు ప్రభాస్ వచ్చి నన్ను సినిమాలో కీలక పాత్రలో నటించమని ఒప్పించారని అందుకు నేను నో చెప్పలేకపోయాను అని పృథ్వీరాజ్ వివరణ ఇచ్చాడు. సలార్‌లో పృథ్వీరాజ్‌ని ప్రత్యేక పాత్రలో నటించమని ప్రభాస్ తన బాధ్యతగా తీసుకున్నాడంటే, అతనిపై ఏ స్థాయిలో నమ్మకం ఉందొ అర్థం చేసుకోవచ్చు.
 

Post a Comment

Previous Post Next Post