మహేష్ సినిమా కోసం RRR కంటే ఎక్కువ బడ్జెట్.. మళ్ళీ వస్తాయా?


ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో ఒకటైన RRR ఇప్పటికే ఐదు వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా ఈజీగా 1000 కోట్లు దాటుతుందని ఫుల్ రన్ లో 1500 కోట్లు కూడా చేయవచ్చు అని చెబుతున్నారు. అయితే రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం అంతకుమించి అనేలా ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. RRR కోసం 500 కోట్ల వరకు ఖర్చు అయినట్లు రాజమౌళి ఓపెన్ గానే తెలియజేశాడు.

మహేష్ సినిమా కోసం మాత్రం RRR కంటే ఎక్కువగా ఖర్చు చేయబోతున్నారట. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం దాదాపు 800 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే ఒక్క హీరో మీద ఈ స్థాయిలో ఖర్చు చేయడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. రాజమౌళి హాలీవుడ్ ప్లాన్ ఏమైనా చేస్తున్నాడా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కథారచయిత విజయేంద్రప్రసాద్ అయితే ఈ సినిమా ఆఫ్రికా అడవులు నేపథ్యంలో ఉంటుంది అని ముందయితే ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇక రాజమౌళి, మహేష్ బాబు మీద అంత భారీగా పెట్టుబడులు పెట్టడం నిజమే అయితే మళ్ళీ తిరిగి వస్తాయా? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.


Post a Comment

Previous Post Next Post