RRR సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సినిమా 500 కోట్ల భారి కలెక్షన్స్ అందుకున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా వివరణ ఇచ్చింది. ఆదివారం వరకు కలెక్షన్స్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఇక సోమవారం నుంచి సినిమాకు అసలు పరీక్ష మొదలుకానుంది.
అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతోంది అనే విషయంలో అనేక రకాల అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా జీ 5లో రెండు నెలల తర్వాత విడుదల అవుతుంది. అంటే జూన్ రెండవ వారంలో సినిమా ఓటీటీలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలకు సంబంధించిన హక్కులను జీ 5 సొంతం చేసుకోగా కేవలం హిందీ భాషలో ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
Follow @TBO_Updates
Post a Comment