బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RRR కోసం ప్రేక్షకులు గత రెండేళ్ల నుంచి ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల అంశాలపై ప్రతీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న రాజమౌళి సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ ఏమైనా ఉంటుందా అనే సందేహాలపై కూడా క్లారిటీ ఇచ్చారు.
సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటించగా.. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒలివియాను తీసుకోవడం జరిగింది. అయితే ఓలివియా ఈ సినిమాలో ఎక్కువగా కనిపించదట కానీ అలియా పాత్ర మాత్రం కథకు మూలం అని చెప్పారు. ఇక సినిమాలో బావోద్వేగమైన ప్రేమ సన్నివేశాలు హీరో హీరోయిన్స్ మధ్యలో ఉంటాయని చెప్పిన రాజమౌళి పెద్దగా రొమాన్స్ ఏమి ఉండదని అన్నారు. కేవలం హీరోల ఇద్దరి మధ్యలోనే ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయని బ్రోమాన్స్ మాత్రం ఎక్కువ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు అని అలాగే వారే విలన్స్ అని వాళ్ళ మధ్యలోనే అన్ని ఎమోషన్స్ ఉంటాయని అన్నారు.
Follow @TBO_Updates
Post a Comment