టాలీవుడ్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RRR రావడానికి ఇంకా రెండు వారాలు కూడా లేదు. ఇక చిత్ర యూనిట్ సభ్యులు మరో రెండు రోజుల్లో రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అంతేకాకుండా దుబాయ్ లో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను కూడా మార్చి 24న తేదీన ప్రదర్శించబోతున్నారు సమాచారం
ఇక సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. సినిమా మార్చి 25 వ తేదీన విడుదలవుతుండగా.. మార్చి 18, లేదా 19 తర్వాత ఆన్లైన్లో RRR సినిమా బుకింగ్స్ ఓపెన్ చేయబడతాయి అని తెలుస్తోంది. ఈ సారి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే త్రిబుల్ ఆర్ సినిమా భారీ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.
Follow @TBO_Updates
Post a Comment