కథ:
ఒక ట్రైబల్ ఏరియా లో మొదలయ్యే ఈ సినిమా కథలో మొదట ఒక బ్రిటీష్ అధికారి గిరిజన అమ్మాయిని తీసుకొని ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఇక ఆ అమ్మాయిని కాపాడేందుకు భీమ్ ఢిల్లీలోని బ్రిటిష్ రాజ్యంలో చొరబడి గిరిజన అమ్మాయిని కాపాడతాడు. ఇక ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా ఉన్న సీతారామరాజుకు భీమ్ ను పట్టుకోవాలని ఆదేశాలు అందుతాయి. ఇక రామ్ రంగంలోకి దిగుతాడు. కానీ ఆ తరువాత కొన్ని పరిణామాలతో రామ్, భీమ్ ఫ్రెండ్స్ గా మారిపోతారు. అనంతరం ఇద్దరి మధ్యలో మరో సమస్య వస్తుంది. ఇక ఆ తరువాత ఇద్దరు మళ్ళీ ఎలా ఒకటయ్యారు. అసలు రామ్ భీమ్ అంతిమంగా దేని కోసం పోరాడారు. మళ్ళీ ఇద్దరు యుద్ధం చేసుకునే పరిస్థితులు ఎలా ఎదురయ్యాయి అనేది పూర్తి సినిమాను చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ..
దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమాను తెరకెక్కించిన కూడా అందులో యాక్షన్ సన్నివేశాలలోనే ఎమోషన్ అనేది చాలా బలంగా ఉంటుంది. ప్రతి సీన్ కూడా మరొక సీన్ కు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక RRRలో కూడా అదే తరహా ఫార్ములా వాడడం జరిగింది. రౌద్రం రణం రుధిరం అనే పదాలకు కూడా సినిమా ఒక అర్డంలా నిలిచింది. ముందుగా చెప్పుకోవాల్సింది ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ గురించి. మొదట అల్లూరి సీతారామరాజు ఇంట్రడక్షన్ సీన్ ను చూపించి ప్రేక్షకులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసిన రాజమౌళి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో చూపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది.
హీరోల పాత్రలు 15 నిమిషాల్లో పరిచయం అయిన తర్వాత అసలైన కథలోకి ప్రేక్షకుడి వెళ్లి పోవడం ఖాయమని చెప్పవచ్చు. అక్కడ ఇద్దరు స్టార్ హీరోను చూడకుండా రామ్, భీమ్ మధ్యలో కొనసాగే బాండింగ్ లోకి ఆడియెన్స్ ఈజీగా జారుకుంటారు. పాత్రల మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కొంత అమాయకంగా అలాగే కొంత రెవల్యూషనరీ తో రోమాలు నిక్కబొడిచేలా నటించాడు. ఇక మరోవైపు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా పైకి ఎంతో స్వచ్ఛంగా కూల్ గా కనిపిస్తూ పలు సన్నివేశాలలో మాత్రం లోలోపల మాత్రం అగ్నిపర్వతాలు బద్దలయ్యేలా హావభావాలను చాలా చక్కగా ప్రెజెంట్ చేయడం జరిగింది.
అప్పటి వరకు ఎంతో స్నేహంగా ఉన్నవారు ఎదురైన సమస్యలను ఒకరి సాయంతో మరొకరు సాల్వ్ చేసుకుంటా మళ్లీ ఊహించని విధంగా పోట్లాడుకోవడం సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్. ముందుగా బ్రిటిష్ వారి నుంచి భీమ్ ను కాపాడిన రామ్ కు ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష వేస్తుంది. ఇక రామ్ క్యారెక్టర్ ను భీమ్ పాత్ర జైలు నుంచి కాపాడడం మరొక హైలెట్ పాయింట్. ఇక ఆలియా భట్ పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ కూడా కథలో చాలా కీలకం అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ కు అన్నం పెట్టే సన్నివేశం అలాగే రామ్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకోవడం చాలా చక్కటి ఎమోషనల్ సీన్స్ ను క్రియేట్ చేశాయి. రాముడికి కష్టం వస్తే వెళ్లాల్సింది సీతమ్మ కాదు లక్ష్మణుడు అంటూ భీమ్ బ్రిటిష్ వారిపై చేసే దండయాత్ర కూడా అద్భుతంగా ఉంది.
ఇక సెకండ్ ఆఫ్ మొదట్లో అజయ్ దేవ్ గన్, శ్రీయ.. సీతారామరాజు తల్లి దండ్రులుగా కనిపిస్తారు. వారు బ్రిటిష్ వారిపై చేసిన పోరాట యుద్ధం కాస్త కమర్షియల్ గా ఉహీంచినట్లే ఉంటుంది. అనంతరం ఇంగ్లీష్ యాక్టర్స్ ఒలివియా అక్కడక్కడా కనిపించగా బ్రిటిష్ ఆఫీసర్ స్కాట్‌గా రే స్టీవెన్‌సన్ మైండ్ బ్లోయింగ్ పర్ఫెమెన్స్ తో మెప్పించాడు. అతని ఎంట్రీ యాక్షన్ బ్లాక్ అదిరిపోయింది అనే చెప్పాలి. గన్ షాట్స్ అయితే కొంత డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంటర్వెల్ ఫైట్ సన్నివేశాలు కూడా సినిమా సెకండాఫ్ పై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఆ తర్వాత సన్నివేశాలను చూడాలి అని ఎంతో ఆత్రుతను కలిగిస్తాయి. మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్ సినిమాలను తలపిస్తాయి.
ఇక క్లైమాక్స్ లో మాత్రం రాజమౌళి తన సత్తా చూపించాడు. ఇద్దరు హీరోల మధ్య కొనసాగే ఎమోషనల్ ఫైట్ సీన్ మాత్రం మామూలుగా ఉండదు అనే చెప్పాలి. ఫ్యాన్స్ కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు చాలా సెన్సిటివ్ గా క్రియేట్ చేసినట్లు ప్రతి షాట్ లో అర్థమవుతోంది. ఇక దీనికి తోడు కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా గుండెను టచ్ చేస్తుంది. సినిమాలో మొదటి పాట నాటు నాటు లో చూడాల్సిన స్టెప్పులు ఇంకా చాలా ఉన్నాయి. దోస్తీ సాంగ్ రాజమౌళి మార్క్ ను గుర్తు చేసే విధంగా ఉంది. ఇక మిగతా సాంగ్స్ కూడా కథకు కనెక్ట్ అయ్యే విధంగా బాగానే ఉన్నాయి. కొమరం భీముడో పాట కూడా హార్ట్ ను టచ్ చేయకుండా ఉండలేదు. ఇక ఆర్ట్ వర్క్ అలాగే సెంథిల్ కుమార్ కెమెరా పనితనం కూడా మెచ్చుకోవాల్సిందే. ఇక యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమా కథకు తగ్గట్టు బాగానే హైలెట్ చేశారు. ఫైనల్ గా సినిమా అయితే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ప్రతి ఒక్కరికి చాలా ఈజీ గా కనెక్ట్ అవుతుంది.
ప్లస్ పాయింట్స్
👉ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన
👉కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిమ్
👉ఎమోషనల్ ఫైట్స్
👉ఇంటర్వెల్, క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
👉సెకండ్ హాఫ్ లో కొన్ని రొటీన్ సీన్స్
ఫైనల్ గా..
సెకండాఫ్ లో కాస్త రొటీన్ సన్నివేశాలు తప్పితే సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ లేవు. ఒకవేళ రొటీన్ సీన్స్ అనిపించినప్పటికీ క్లైమాక్స్ తోనే రాజమౌళి ఆ ఆలోచనను చేరిపేసి చివరలో ఆడియెన్స్ కట్టిపడేస్తాడని చెప్పవచ్చు. ఇక ఎలాంటి డౌట్స్ లేకుండా మరోసారి రాజమౌళి వండర్ ను చూసి ఎంజాయ్ చేయడం బెటర్.
Post a Comment