RC 15: ఆ టైటిల్ పై శంకర్ ఫోకస్.. ఆ రోజే సర్‌ప్రైజ్!


రామ్ చరణ్ RRR సినిమా అనంతరం వెంటనే శంకర్ తో మరొక పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయం కూడా లీక్ కావద్దని దర్శకుడు శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి కూడా ఏదో ఒక విషయం బయట లీక్ అవుతూనే ఉంది. ఆ మధ్య చిత్ర యూనిట్ లీక్ చేస్తే కేసులు వేస్తామని హెచ్చరించింది కూడా.

ఇక RC 15 ప్రాజెక్ట్ కు టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా కథకు తగ్గట్టుగా కనెక్ట్ అయ్యేలా 'సర్కారోడు' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో రెండు టైటిల్స్ పై కూడా చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ టైటిల్ ఫిక్స్ అయితే మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ పోస్టర్ తో సర్ ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post