కథ:
కృష్ణ మోహన్ (సూర్య) ఒక న్యాయవాదిగా పల్లెటూరిలో ఒక ఫ్యామిలీ వాతావరణంలో ఆనందంగా ఉంటాడు. ఇక అతనికి అదిర (ప్రియాంక అరుల్ మోహన్) బాగా నచ్చడంతో ఆమెను ప్రేమలోకి దింపుతాడు. మరోవైపు కమేష్ (వినయ్ రాయ్) అనే వ్యక్తి అమ్మాయిలను ట్రాప్ చేయడం అలాగే వారి నుండి అశ్లీల వీడియోలు చేయడం వంటి సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. ఇక హీరో ఆ విషయాన్ని ఎలా కనుగొన్నారు అసలు కామేష్ నుంచి అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి. చివరగా ఒక న్యాయవాదిగా ఈ సమస్యను కృష్ణ మోహన్ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ET కథ.
విశ్లేషణ:
ET అనే ఈ సినిమా కథకు తగ్గట్టుగా ఎవరికి తలవంచకు అనే టైటిల్ కరెక్ట్ గానే సరిపోయింది. దర్శకుడు పాండిరాజ్ గత రెండు సినిమాలు కూడా విలేజ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినవే. ఇక ఈటీ సినిమాలో అలాంటి వాతావరణం నుంచి అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల వరకు కొనసాగుతుంది. దర్శకుడు ఒక మంచి పాయింట్ ను తీసుకున్నాడు. ఎవరికి తలవంచకు అనే టైటిల్ అనగానే హీరో మాస్ కమర్షియల్ ఎలివేషన్ గురించి అందరూ ఆలోచిస్తారు. ఇక ఆ టైటిల్ వెనుక బాధిత అమ్మాయిలు సిగ్గుతో తలవంచాల్సిన అవసరం లేదని తప్పు చేసిన వారు తగిన శిక్ష అనుభవించాలి అనే పాయింట్ ను హైలెట్ చేశారు.
ఇక ఈ సినిమా కథనం విషయంలో దర్శకుడు పాండిరాజ్ కన్ఫ్యూజన్ లేకుండా క్లుప్తంగా చెప్పాలని అనుకున్న విషయం బాగానే ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా సన్నివేశాలను ఆకట్టుకునే రేంజ్ లో అయితే తెరపైకి తీసుకు రాలేదు. చాలా వరకు సన్నివేశాలు చాలా రొటీన్ గా అనిపించడమే కాకుండా కొన్నిసార్లు ఎదో సీరియల్ చూస్తున్న భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం విలేజ్ లవ్ ఫ్యామిలీ పాయింట్స్ ను హైలెట్ చేసి ఇంటర్వెల్ బ్యాంగ్ లో అసలైన ట్విస్ట్ ను హైలెట్ చేయడం జరిగింది. అయితే అనుకున్న పాయింట్ కు తగ్గట్టుగా సినిమా సెకండ్ హాఫ్ కూడా ఆకట్టుకునే రేంజ్ లో అయితే కొనసాగలేదు. ఒక న్యాయవాదిగా మారిన సూర్య అమ్మాయిలపై చట్టపరంగా పోరాటం చేస్తూనే మరోవైపు న్యాయవాదిగా తన బాద్యతను పూర్తి చేస్తుంటాడు.
అయితే హీరో ఎదుర్కొనే సమస్యలను చాలా సునాయాసంగా సాల్వ్ చేయడం కూడా ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ హైలెట్ చేసి సెకండ్ హాఫ్ లో హేవి ఎమోషన్స్ ను కూడా దర్శకుడు తేడా కొట్టించేశాడు. సూర్య విభిన్నమైన షేడ్స్ లో కనిపించిన విధానం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. జై భీమ్ అనంతరం మరోసారి లాయర్‌గా బాగా నటించి సినిమాను తన భుజాలపై వేసుకున్నాడు. యాక్షన్ బ్లాక్స్‌లో సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఇక ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ హాఫ్ లో డల్ గా కనిపించినా సెకండ్ హాఫ్ లో మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇక సెకండాఫ్‌లో మంచి ఎమోషన్స్ ఉంటాయి. క్లైమాక్స్‌లో చూపించిన సందేశం కూడా బాగుంది. ఇక సోషల్ మీడియా వల్ల సమాజంలో అమ్మాయిలు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే పాయింట్ కూడా హైలైట్ చేయబడింది. సినిమా యొక్క అతి పెద్ద లోపం ఏమిటంటే మొదటి సగం బోరింగ్ గా సిల్లీగా ఉంటుంది. కథ అయితే బాగుంది. కానీ మొదట్లోనే కథలోని మేజర్ పాయింట్ ను హైలెట్ చేయాల్సింది. విసుగుగా అనిపించే సిల్లీ ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ కథకు అడ్డు పడుతున్నట్లు ఉంటాయి. ఇక సినిమాలో తమిళ ఫ్లేవర్ చాలా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఆ ఫ్లేవర్ కనెక్ట్ కాకపోవచ్చు. ఇమ్మాన్ చేసిన BGM డీసెంట్ గా ఉంది కానీ కెమెరా పనితనం అంతగా ఆకట్టుకోలేదు.
ప్లస్ పాయింట్స్:
👉సూర్య క్యారెక్టర్
👉స్టోరి
మైనస్ పాయింట్స్:
👉ఫస్ట్ హాఫ్
👉స్క్రీన్ ప్లే
👉రొటీన్ సీన్స్
ఫైనల్ గా.. ET 'ఎక్కడో తేడా' కొట్టేసింది..
రేటింగ్: 2.25/5
Follow @TBO_Updates
Post a Comment