టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా మంచి క్రేజ్ అందుకున్న సునీల్ ఎక్కువగా త్రివిక్రమ్ రాసిన పాత్రలతోనే క్లిక్కయ్యాడు. త్రివిక్రమ్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తన ప్రతీ సినిమాలో సునీల్ కు ఎదో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తూ వస్తున్నాడు. ఓకే కాలేజ్ లో మొదలైన వీరి స్నేహం సినిమాల వరకు అలానే కొనసాగింది.
అయితే హీరోగా కెరీర్ యూ టర్న్ తీసుకున్న అనంతరం సునిల్ అనుకున్నంతగా క్లిక్కవ్వలేదు. ఇక ఆ తరువాత మళ్ళీ త్రివిక్రమ్ ద్వారా అరవింద సమేత సినిమాతో సైడ్ రోల్స్ చేసేందుకు రీ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే అల.. వైకుంఠపురములో కూడా మంచి రోల్ చేశాడు. కానీ అవేవి కూడా సునీల్ ను కమెడియన్ గా నిలబెట్టలేదు. ఇక భీమ్లా నాయక్ సినిమాలో ఒక సాంగ్ లో అలా మెరుపు తీగలా కనిపించిన సునీల్ కొన్ని సన్నివేశాల్లో నటించినప్పటికీ అవి అవసరం లేదని ఎడిటింగ్ లేపేశారు. తన స్నేహితుడి కెరీర్ కు త్రివిక్రమ్ మళ్ళీ బూస్ట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పటికి వర్కౌట్ కావడం లేదు.
Follow @TBO_Updates
Post a Comment