సుక్కు - చరణ్.. ఆలస్యంగానే?


సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ తో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పుష్ప రెండవ భాగం తరువాత విజయ్ దేవరకొండ తో మరొక సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తో మరో డిఫరెంట్ యాక్షన్ మూవీ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఆ సినిమా తెర పైకి రా రావడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.

ఎందుకంటే పుష్ప 2 తరువాత విజయ్ దేవరకొండ తో అతిపెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టు చేయబోతున్నాడు సుక్కు. ఆ సినిమాకు కూడా ఏడాది టైం పడుతుంది. అంటే దాదాపు 2023లో ఆ సినిమా వస్తుంది అనుకున్న రామ్ చరణ్ సినిమా మొదలు పెట్టాలంటే 2024 లోనే కుదురుతుంది కాబట్టి 2024 చివరిలో లేదా 2025 మొదట్లో రామ్ చరణ్ సినిమా రావచ్చు అని సమాచారం. అది కూడా సుకుమార్ గతంలో మాదిరిగా ఆలస్యం చేయకపోతే ఆ సమయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సుకుమార్ గురించి ముందే తెలుసుకున్న రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరితో అంతకంటే ముందే ప్రాజెక్టును ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నాడు.


Post a Comment

Previous Post Next Post