యాక్షన్ డైరెక్టర్ సురేంధర్ రెడ్డి తన తదుపరి సినిమాను అఖిల్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఏజెంట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తప్పకుండా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని అఖిల్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మరొక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కూడా నటిస్తున్నారు.
ఇక ఆయనకు రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఇస్తున్నారు అనే విషయంలోకి వెళితే దాదాపు హీరో అఖిల్ రేంజ్ లోనే ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అనుకున్నంతగా సక్సెస్ చూడని అఖిల్ ఏజెంట్ సినిమా కోసం 4 నుంచి 5కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక మమ్ముట్టి స్పెషల్ క్యారెక్టర్ కోసం దాదాపు అదే రేంజ్ లో అడిగినట్లు టాక్. ఇక సినిమాను అఖిల్ మార్కెట్ కు మించి 50కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు. అయితే సినిమా బిజినెస్ ను బట్టి రిలీజ్ అనంతరం ప్రాఫిట్స్ లో అఖిల్ కు మరికొంత ఇచ్చే అవకాశం ఉందట.
Follow @TBO_Updates
Post a Comment