త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జల్సా సినిమా నుంచి కొనసాగుతున్న వీరి ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి పవన్ వెళ్ళిన అనంతరం అతని సినిమాలకు సంబంధించిన పూర్తి నిర్ణయాలన్నీ కూడా త్రివిక్రమ్ తీసుకుంటున్నారు అనేది ఇన్ సైడ్ టాక్.
ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమాకు తన పెన్ పవర్ చూపించిన త్రివిక్రమ్ మరొక రెండుసార్లు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం రైటర్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. వినోదయసీతం రీమేక్ లో పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ నటించే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం కూడా తెలుగులో పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అందించనున్న త్రివిక్రమ్.. సముద్రఖనితో డైరెక్షన్ చేయించనున్నాడు. ఇక తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ తేరి సినిమాకు కూడా త్రివిక్రమ్ ఒక రైటర్ గా వర్క్ చేయబోతున్నాడు. ఆ సినిమాకు సాహో దర్శకుడు సుజిత్ డైరెక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment