రాధే శ్యామ్ ఎఫెక్ట్.. థమన్ ప్రభాస్ కాంబో ఫిక్స్?


ఇటీవల కాలంలో సంగీత దర్శకుడు థమన్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటున్నాయి. ప్రత్యేకంగా థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ గా కూడా మారుతున్నాడు. చాలా మంది హీరోలు థమన్ ను బ్యాగ్రౌండ్ కోసమే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకుంటూ ఉండటం విశేషం.

ఇక ఫైనల్ గా తమ రాధే శ్యామ్ సినిమాతో ఎట్టకేలకు ప్రభాస్ ను బాగానే ఆకర్షించాడు. ఈ సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉన్నా కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకు కొంత హెల్ప్ అయింది అని చెప్పాలి. ప్రభాస్ కూడా థమన్ రాకముందు ఒక విధంగా చూసిన సినిమాను థమన్ వచ్చిన తర్వాత మరొక విధంగా చూసినట్లుగా చెప్పాడు. ఇక అనుకున్నట్లే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post