బుర్జ్ ఖలీఫాపై రాజమౌళి న్యూ ప్లాన్?


ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ RRR కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇప్పటికే ఐదు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే మరోసారి సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇక అన్ని భాషల్లో సినిమా విడుదల అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సినిమాకు మంచి క్రేజ్ వచ్చేలాగా ఒక ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ ను దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో నిర్వహించాలని అనుకుంటున్నారు. మార్చి 15వ తేదీ లేదా 20 వ తేదీన ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వెనుకడుగు వేయక తప్పలేదు. మరి ఈసారి అనుకున్నట్లుగా ఆ ప్లాన్ ను ఆచరణలో పెడతారో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post