అయ్యయ్యో.. సల్మాన్ కి పెళ్లి చేసేశారే?


బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో అని అందరికి తెలిసిందే. పలుసార్లు ప్రేమలో విఫలమైన ఈ కండల వీరుడు ఒక హీరోయిన్ చేసిన మోసం కారణంగా పెళ్లి అనే మాటకు దూరమయ్యాడు. ఇక ఆ తరువాత డేటింగ్స్ తప్పితే నో మ్యారేజ్, జో లవ్ అనే పద్దతిలో ప్లే బాయ్ గా కొనసాగుతున్నాడు.


ఇక సల్మాన్ ఖాన్ కు ఇటీవల పెళ్లి జరిగిపోయింది అని సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సీన్హాతో అని వార్తలు కూడా అల్లెశారు. కానీ నిజానికి ఆ ఫొటోలో ఉన్నది తమిళ నటుడు ఆర్య, హీరోయిన్ అయేషా. వారిద్దరి పెళ్లి ఫొటోలో సల్మాన్, సోనాక్షి మొహాలు ఫోటో షాప్ చేసి షాక్ ఇచ్చారు. కాస్త ఫొటోలు మార్చేసినా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతుండడం విశేషం.


Post a Comment

Previous Post Next Post