పూజ హెగ్డేతో ముద్దు సీన్లపై ప్రభాస్ షాకింగ్ రియాక్షన్


రాధేశ్యామ్ సినిమా రొమాంటిక్ లవ్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు ప్రభాస్ తన సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు చేసేందుకు ఇబ్బంది పడుతుంటాడట. ఎన్నో ఇంటర్వ్యూలలో ఆ విషయాన్ని చెప్పాడు. ఇక రాధేశ్యామ్ లో ఎలా చేశారు అనే విషయంపై డార్లింగ్ సింపుల్ గా ఒక క్లారిటీ ఇచ్చాడు.

ఆ సన్నివేశాల గురించి ప్రభాస్ మాట్లాడుతూ, ఇది రొమాంటిక్ చిత్రం కాబట్టి ఆ సన్నివేశాలు అవసరమని తాను నో చెప్పలేనని చెప్పాడు. కమర్షియల్‌ సినిమాల్లో ఈ సీన్‌లు తప్పవని, రాధే శ్యామ్‌ లాంటి ప్రాజెక్టుల్లో మాత్రం ఈ సీన్‌లు తప్పవని అన్నారు. ఎప్పుడు కూడా తన సహనటిని ముద్దుపెట్టుకోవడానికి లేదా సిబ్బంది అందరి ముందు చొక్కా తీసివేయడానికి సిగ్గుపడతానని ప్రభాస్ చెప్పాడు.  అందుకే ఈ సన్నివేశాలను ఏకాంత ప్రదేశాల్లో చిత్రీకరించమని తన దర్శకుడిని తరచుగా సూచిస్థానాని చెప్పుకొచ్చాడు. ఇక రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన రాధేశ్యామ్ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Post a Comment

Previous Post Next Post