భీమ్లా నాయక్ డైరెక్టర్.. మరో మెగా హీరోతో న్యూ మూవీ?


భీమ్లా నాయక్ సినిమాతో మొత్తానికి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు సాగర్ కె చంద్ర తర్వాత ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం మళ్లీ సాగర్ మెగా కాంపౌండ్ లోనే సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే భీమ్లా నాయక్ కంటే ముందు సాగర్ వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు.

ఇంతకుముందు ఈ దర్శకుడు అయ్యారే, అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే రెండు సినిమాలతో గుర్తింపు అందుకున్నాడు. అతని పనితనం గురించి తెలిసిన త్రివిక్రమ్ భీమ్లా నాయక్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు.. ఇక భీమ్లా కంటే ముందు వరుణ్ తేజ్ తో సినిమా చేయాలని సాగర్ ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ ప్రాజెక్టును స్టార్ట్ చేసే విషయంలో సక్సెస్ కాలేకపోయాడు. ఇక మొత్తానికే ఆగిపోయింది అనుకున్న ఆ ప్రాజెక్టు మళ్ళీ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ భీమ్లా దర్శకుడితో మరోసారి చర్చలు మొదలుపెట్టినట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post