సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్నటువంటి అనుష్క శెట్టి స్క్రీన్ పై కనిపించి చాలా కాలమైంది ఆమె చివరగా నటించిన నిశ్శబ్దం సినిమా OTT లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళ వరకు తన ఫ్యామిలీ తోనే ఉంటున్నా అనుష్క శెట్టి స్క్రిప్టులు కూడా ఎక్కువగా వినడం లేదట.
మొత్తానికి యు.వి.క్రియేషన్స్ లో నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తో కూడా ఒక లేడి ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ దర్శకుడితో ఇదివరకే అనుష్క విక్రమ్ 'నాన్న' అనే సినిమా చేసింది. అందులో మేకప్ లేకుండా నటించిన అనుష్క కు మంచి గుర్తింపు లభించింది. ఇక మరోసారి ఆ దర్శకుడితో ద్విభాషా చిత్రాన్ని చేసేందుకు రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే ఆఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment