అజిత్ తెలుగు మార్కెట్ పై మరింత ఫోకస్?


తమిళ హీరో అజిత్ మొత్తానికి వాలిమై సినిమాతో తెలుగులో అయితే తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి తెలుగులో అయితే బయ్యర్లకు కొంత లాభాన్ని అయితే అందించింది. చూస్తుంటే అజిత్ సినిమాలు భవిష్యత్తులో రెండు నుంచి మూడు కోట్ల మధ్యలో బిజినెస్ చేసే అవకాశం ఉంది.

కరెక్టుగా సినిమాలకు ప్రమోషన్ చేసే రిలీజ్ చేస్తే మార్కెట్ వాల్యూ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అజిత్ తదుపరి సినిమాను హెచ్ వినోథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఆ సినిమాలో అజిత్ ఒక బ్యాంక్ దొంగగా కనిపిమ్చానున్నాడట. ఆ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్ లో ఉంటుందట. ఇక తెలుగు నుంచి ఒక స్టార్ యాక్టర్ ఆ సినిమాలో కీలక పాత్రలో నటించే ఛాన్స్ ఉందని టాక్ వస్తోంది. వాలిమై సినిమాలో తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటించాడు. కానీ ఆ సినిమా తమిళంలో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక తెలుగులో మరోసారి అదే ఫార్మాట్ లో మరొక స్టార్ ను రాబోయే సినిమాలో వాడబోతున్నాడు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post