ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై ఫైనల్ చర్చలు కొనసాగుతున్నాయి. అసలైతే ఈ ప్రాజెక్ట్ పై బుచ్చిబాబు ఎప్పుడో క్లారిటీ ఇచ్చినప్పటికీ తారక్ నుంచి మాత్రం ఇంకా అఫీషియల్ గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు.
ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకున్నారు. ఇక సన్నిహితుల ప్రకారం, ఈ చిత్రం త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఏప్రిల్ 11 ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే రూపొందించనున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment