యంగ్ హీరో అఖిల్ తదుపరి చిత్రం ఏజెంట్ విడుదల తేదీ లాక్ చేయబడింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) సెలవుదినం చాలా బాగా హెల్ప్ అవుతుంది అనే చెప్పాలి. ఆగస్టు 12 శుక్రవారం ఇక వీకెండ్ అనంతరం సోమవారం ఆగస్టు 15 కూడా సినిమా వసూళ్లకు బూస్ట్ ఇవ్వనుంది.
అంతే కాకుండా సినిమాలో అఖిల్ భారత సైన్యానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ గూఢచారి పాత్రలో నటిస్తున్నాడు. కాబట్టి సినిమాలో దేశభక్తి అంశాలు కూడా గట్టిగానే ఉంటాయి. ఇక సినిమాకు అంతకంటే మంచి రిలీజ్ డేట్ మరొకటి ఉండదు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో అఖిల్ స్టైలిష్ గా భయంకరమైన అవతార్‌లో కనిపించాడు. తుపాకీ పట్టుకుని ఉగ్రవాదులను అంతమొందించే ఆపరేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కొందరు అధికారులు తుపాకులు పట్టుకుని ఉన్నారు. పోస్టర్ నిజంగానే ఘాటుగా కనిపిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment