రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ ఇటీవల సోషల్ మీడియాలో మరోసారి ఫాలోవర్స్ తో చాట్ చేశాడు. ట్విట్టర్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని సరికొత్త ప్రేమ ప్రపంచంలో మునిగి తేలుతారు అని వివరించారు. ఇక సినిమాలో ఎన్ని జన్మలుంటాయి అనే ప్రశ్నలు చాలా వచ్చాయి.
అందరూ అనుకుంటున్నట్లు ఇందులో రెండు జన్మలు ఉంటాయా అని ఒక అడిగిన ప్రశ్నకు రాధాకృష్ణ ఈ విదంగా ఆన్సర్ ఇచ్చాడు. ఒక్క జన్మ ప్రేమని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం మళ్ళీ రెండు ఎందుకు బ్రదర్ అంటూ రాధాకృష్ణ వివరణ ఇచ్చారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుందని అన్నారు. మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment