పూరి జనగణమన కోసం విజయ్ న్యూ లుక్ వైరల్!


ఇటీవల లైగర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన పూరి జగన్నాథ్ ఆగస్టులో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా విడుదల కాకముందే విజయ్ దేవరకొండ తో పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ బు మొదలు పెట్టబోతున్నాడు. గత 15 ఏళ్లుగా పూరి జనగణమన అనే కథ పై చాలా హార్డ్ వర్క్ చేశాడు. 

ఈ సినిమాను మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తో కూడా చేయాలని అనుకున్నాడు. కానీ ఎందుకో సెట్ అవ్వలేదు. ఇక ఫైనల్ గా లైగర్ సినిమా తో రౌడీ హీరో కి బాగా కనెక్ట్ అయిన పూరి అతనితోనే జనగణమన ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన లుక్ కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇటీవల గచ్చిబౌలిలో వాలీబాల్ ప్రీమియర్ లీగ్ లో దర్శనమిచ్చిన విజయ్ పూర్తిగా కొత్తగా కనిపించాడు. లైగర్ తో ఇన్నాళ్లు ఫుల్ హెయిర్ తో కనిపించిన విజయ్ ఇప్పుడు జనగణమన కోసం స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post