90 ఏళ్ళ దర్శకుడితో అనుష్క మూవీ?


ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ కోసం మళ్లీ దర్శకత్వం వహించాలని ఆసక్తిగా ఉన్నాడు. బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత కథపై 90 ఏళ్ల వయసులో ఆయన రీసెర్చ్ కూడా చేశారు. ఇది ఒక దేవదాసి జీవిత కథ. ఈ సినిమా స్క్రిప్ట్ ఇటీవలే పూర్తయింది. బుర్రా సాయి మాధవ్ బెంగుళూరు నాగరత్నమ్మ డైలాగ్ వెర్షన్‌ను పూర్తి చేసారని సమాచారం.  

ఇక ఈ చిత్రంలో బలమైన ఎమోషనల్ డ్రామాతో పాటు అన్ని కమర్షియల్ హంగులు కూడా ఉంటాయట.  ఈ సినిమా కోసం మొదట టాలీవుడ్ నటి సమంతను సంప్రదించగా ఎందుకో ఆమె ఒప్పుకోలేదట. ప్రస్తుతం అప్‌డేట్ ప్రకారం ఆ స్క్రిప్ట్ అనుష్కకు చేరినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పూర్తిగా విన్న అనుష్క ఇంకా ఫైనల్ కాల్ తీసుకోలేదు.  ఆమె నిర్ణయం తీసుకునే ముందు బెంగళూరు నాగరత్నమ్మ బృందం మరికొంత కాలం వేచి ఉండాలని అనుకుంటోంది.  లేదంటే మరో హీరోయిన్ ను ఫైనల్ చేసే అవకాశం ఉందట.

Post a Comment

Previous Post Next Post