3 కోట్ల నుంచి 300కోట్లకు.. ది కశ్మీర్ ఫైల్స్ సంచలనం


కశ్మీర్ లో హిందు పండితులపై జరిగిన దాడులు నేపథ్యంలో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ సరికొత్త సంచలనం సృష్టించే దిశగా బాక్సాఫీస్ కలెక్షన్లు అందుకుంటోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించారు. సినిమా విడుదలైన మొదటి రోజు ఈ సినిమా గురించి పెద్దగా ఎవరు అంతగా పట్టించుకోలేదు.

ఇక సినిమాకు మోడీ నుంచి కూడా ప్రశంసలు అందడంతో అప్పటి నుంచి కలెక్షన్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ సినిమా కోసం 5 నుంచి 7కోట్ల మధ్యలో బడ్జెట్ అయ్యింది. ఇక మొదటి రోజు మూడు కోట్లతో ప్రయాణం మొదలవ్వగా  ఇప్పుడు 167కోట్లకు చేరింది.  రెండవ వారంలో శుక్రవారం 19కోట్లు, శనివారం 24కోట్లు, ఆదివారం 26కోట్ల వసూళ్లతో షాక్ ఇచ్చింది. మూడు కోట్లతో మొదలైన ఈ సినిమా మొత్తంగా 300కోట్ల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post