కొన్ని సంవత్సరాలుగా నయనతార సౌత్ ఇండియన్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆమె ఒక్క సినిమా కోసం దాదాపు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని టాక్ వస్తోంది. పైగా ఆమె స్వయంగా నిర్మించే సినిమాలు అంతకు మించి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఇక సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో సమంత రెండో స్థానంలో నిలిచేందుకు పోటీపదుతున్నట్లు సమాచారం
ఆమె ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంటున్నారు. అల్లు అర్జున్ 'పుష్ప'లో 'ఊ అంటావా' అనే పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చినందుకు గాను ఆమె ఏకంగా కోటిన్నర పారితోషికం తీసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత, సమంత మరిన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తోంది. ప్రస్తుతం 'యశోద' మరో ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఇప్పటికే విడుదల విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన 'కాతు వాకులా రెండు కాదల్' లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఆ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది.
Follow @TBO_Updates
Post a Comment