మహేష్ బాబు ఉ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరపైకి రాబోతోంది. నేడు అధికారికంగా సినిమాకు సంబంధించిన లాంచ్ కార్యక్రమాలు కూడా ముగిశాయి. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ గా పూజ హెగ్డేను ఫైనల్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులో నటించేందుకు భారీస్థాయిలో పారితోషికం కూడా ఇస్తున్నట్టు సమాచారం.
మొన్నటి వరకు రెండు కోట్లు తీసుకున్న బుట్టబొమ్మ ఇప్పుడు మాత్రం రెండు కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సినిమా కోసం కూడా అదే స్థాయిలో అందుకుందని సమాచారం. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేస్తారని అంటున్నారు. కుదిరితే అంతకంటే ముందే విడుదలయ్యే అవకాశం ఉంటుందట. ఇక ప్రస్తుతం పూజా రాధేశ్యామ్ బీస్ట్ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Follow @TBO_Updates
Post a Comment