RRR, రాధేశ్యామ్.. ఇలాగైతే ఏపీలో కష్టమే?


భీమ్లా నాయక్ సినిమా కోసం థియేటర్స్ వద్ద ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం అధికారులను CPRF బలగాలను దించిన ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాపై పనిగట్టుకొని ఫోకస్ చేసినట్లు అర్థమైంది. ఇక ఆ సంగతి పక్కన పెడితే రాబోయే సినిమాల విషయంలో జగన్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన RRR సినిమా, 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాలపై కూడా ఇదే తరహాలో ఉంటే పెద్ద సినిమాలు ఏపీ బిజినెస్ ను మర్చిపోవాల్సిందే. బహుశా పవన్ సినిమా కాదు కాబట్టి అప్పటివరకు మరో జీవో తీసుకు వస్తారో ఏమో చూడాలి. లేకపోతే మరోసారి జగన్ గారిని కలవాల్సిందే. ఇప్పటికే అనేక సార్లు కలిసినప్పటికి జగన్ సర్కారు చర్చల వరకే వార్తల్లో నిలిచింది గాని సొల్యూషన్ మాత్రం ఇవ్వలేదు. ఇక RRR, రాధేశ్యామ్ ఏపీలో భీమ్లా కంటే ఎక్కువ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి కాబట్టి మరోసారి జగన్ దగ్గరకు వెళ్లి అడుక్కోవాల్సిందే అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇదే రేట్లు కొనసాగితే మాత్రం బయ్యర్లు తీవ్రంగా నష్టపోవడం ఖాయం.

Post a Comment

Previous Post Next Post