RRR కోసం మరో స్పెషల్ ఈవెంట్?


RRR రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఈ చిత్రం మార్చి 25 న విడుదల కానుందని చెప్పారు. ఇక రిలీజ్ ప్రమోషన్ లో ప్రణాళికలు సిద్ధం చేసి మరోసారి పలు కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో రాజమౌళి ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తారని టాక్ వస్తోంది.

ఇక ఇండియా, యూఎస్ లో ముందస్తు బుకింగ్‌లు మార్చి రెండవ వారంలో ప్రారంభమవుతాయట. సమయం దొరికితే యూఎస్ వెళ్లి అక్కడ ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నారట. యూఎస్ లో సినిమాకు భారీగా డిమాండ్ ఉన్నట్లు గతంలో బుకింగ్స్ ద్వారా ఒక క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతి విడుదలప్పుడు అడ్వాన్స్ బూకింగ్స్ తోనే 1 మిలియన్ డాలర్లు అందుకుంది. ఇక ఇప్పుడు రాజమౌళి యూఎస్ మార్కెట్ కోసం భారీగా ఈవెంట్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post