Naga Chaitanya Web Series Details!


విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య అమెజాన్ ప్రైమ్ తో వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ వెబ్ కంటెంట్ సెట్స్ పైకి హారర్-థ్రిల్లర్ అని టాక్ నడుస్తోంది. అయితే ఈ షోకు లేటెస్ట్ టామ్ ప్రకారం ధూత అనే టైటిల్‌ను పెట్టినట్లు సమాచారం. ఈ థ్రిల్లర్‌లో ధూత అంటే మెసెంజర్ అని తెలుస్తోంది.

చై చాలా ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నాడట. వార్తల ప్రకారం, చై ఈ సిరీస్ కోసం సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని సమాచారం.  మేకర్స్ ఇప్పటికే అతని లుక్‌ని ఫైనల్ చేశారు. ప్రస్తుతం, చై తన కొత్త చిత్రం థాంక్యూ షూటింగ్‌లో యూరప్‌లో ఉన్నాడు.  ఈ సినిమా పూర్తయ్యాక అమెజాన్ ప్రైమ్ సిరీస్‌ను ప్రారంభించనున్నాడు. అలాగే అతను పరశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. నందిని రెడ్డితో కూడా ఒక సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post